Amaravati Secretariat: అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం
అమరావతి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించిన కీలక సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి (GSDP), ప్రభుత్వ సేవలను మరింత వేగవంతం చేసేందుకు RTGS (Real Time Governance System) అమలు, రైతులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల వ్యవస్థ, అలాగే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు వివరించగా, ముఖ్యమంత్రి గారు పలు కీలక సూచనలు చేశారు. ఇది మంచి ప్రభుత్వంగా ప్రజల ఆశలను నిలబెట్టుకునే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో స్పష్టం చేశారు.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


