Gangaram Arrest: దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరుడిగా పేరున్న గంగారాంను పోలీసులు అరెస్ట్
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరుడిగా పేరున్న గంగారాంను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అనంతపురం జిల్లాలో గంగారాం ఆగడాలు శృతిమించాయని, అతని అక్రమ కార్యకలాపాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఎమ్మెల్యే అండదండలతో గంగారాం ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడులు చేయడమే కాకుండా, నంబూరి వైన్స్‌కు నిప్పు పెట్టిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదుల మేరకు ప్రజల నుంచి పెరిగిన ఒత్తిడితో పోలీసులు కేసులు నమోదు చేశారు.
కేసులు నమోదైనప్పటికీ గంగారాం పరారీలో ఉండగా, తాజాగా గోవాలో అతడిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో జిల్లాలో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
అయితే గంగారాం వెనుక ఉన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. అక్రమాలకు పాల్పడిన అనుచరుల విషయంలో బాధ్యత వహించాలంటూ ప్రజలు, ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్పందిస్తారా? ఎమ్మెల్యే పాత్రపై లోతైన విచారణ జరుగుతుందా? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


