back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeAndhra Pradesh Politicsబీజేపీ నూతన శకానికి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్దతు – PVN Madhav

బీజేపీ నూతన శకానికి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్దతు – PVN Madhav

BJP National President: జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ నామినేషన్‌కు ఏకగ్రీవ మద్దతు

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు ఢిల్లీలోని ఆంధ్రా భవన్ వేదికగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో, పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ప్రస్తుతం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న యువ నాయకుడు శ్రీ నితిన్ నబిన్ గారి అభ్యర్థిత్వానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు, ప్రతినిధులు నితిన్ నబిన్ గారిని జాతీయ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా సమర్థిస్తూ అధికారికంగా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ సాధిస్తున్న విజయాలను మరింత విస్తరించేందుకు నితిన్ నబిన్ గారి నాయకత్వం కీలకంగా నిలుస్తుందని, పార్టీకి ఇది ఒక నూతన శకానికి నాంది అవుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పార్టీని మరింత ప్రజలలోకి తీసుకెళ్లేందుకు తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles