back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeAndhra Pradesh Politicsఉపాధి హామీ చట్ట పునరుద్ధరణకు ఫిబ్రవరి 2 నుంచి పరిరక్షణ యాత్ర – వైఎస్ షర్మిల

ఉపాధి హామీ చట్ట పునరుద్ధరణకు ఫిబ్రవరి 2 నుంచి పరిరక్షణ యాత్ర – వైఎస్ షర్మిల

MGNREGA: యాత్రపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించిన వైఎస్ షర్మిల

అనంతపురం: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం (మన్రేగా)ను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 2 నుంచి చేపట్టనున్న ఉపాధి హామీ పరిరక్షణ యాత్రపై వైఎస్ షర్మిల నేడు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి ప్రారంభం కానున్న యాత్రను దిగ్విజయం చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని నాయకత్వానికి వైఎస్ షర్మిల దిశా నిర్దేశం చేశారు.

మన్రేగా చట్టం ద్వారా గ్రామీణ పేదలకు కలిగే లబ్ధిని ప్రజలకు వివరించాలని, అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన VB G RAM G (గ్రామ్ జి) చట్టం వల్ల ఉపాధి హామీ లబ్ధిదారులకు జరుగుతున్న నష్టాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. గ్రామ్ జి చట్టాన్ని రద్దు చేసేలా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

ఉపాధి హామీ పథకం గ్రామీణ ఉపాధికి వెన్నెముకలాంటిదని, దాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles