MGNREGA Parirakshana Yatra: కాంగ్రెస్ పోరాటానికి బలం: వైఎస్ షర్మిల
పుంగనూరు (అన్నమయ్య జిల్లా): మన్రేగా (MGNREGA) పరిరక్షణ యాత్ర నాలుగో రోజు అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చేరుకోగా, స్థానిక ప్రజలు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. శ్రామికుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ పోరాటానికి పుంగనూరు ప్రజల నుంచి విస్తృత మద్దతు లభించింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ,
శ్రామికుల పొట్టగొట్టే VB G – RAM G చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని, అలాగే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ చట్టం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా లభించిందని, అలాంటి చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. ఈ యాత్రకు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని ఇస్తోందని తెలిపారు.
శ్రామికుల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


