YSRCP Leaders Join TDP: కడపలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు పసుపు కండువాలు కప్పి ఆహ్వానించిన రెడ్డప్పగారి మాధవి
కడప: ఈరోజు కడప నగరంలోని 46వ డివిజన్ శాస్త్రి నగర్ మరియు 44వ డివిజన్ కాగితాల పెంట సత్తార్ కాలనీ ప్రాంతాల నుండి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార కమిటీ మాజీ అధ్యక్షులు నాగేంద్ర రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అలాగే ప్రకాశ్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మరియు 44వ డివిజన్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు మున్నా గారు వారి మిత్రులు టిడిపిలో చేరారు.
ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి, పార్టీలో చేరిన వారందరికీ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించినట్లు రెడ్డప్పగారి మాధవి తెలిపారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలపై నమ్మకంతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రగతి కోసం కలిసి పనిచేయడానికి సిద్ధమైన ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, అందరూ కలిసికట్టుగా కృషి చేసి కడపను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలుపుదామని ఆమె పిలుపునిచ్చారు.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


