Rajaka Aakanksha Sabha 5: నంద్యాలలో ‘రజక ఆకాంక్ష సభ–5’కు హాజరు… రజకుల సమస్యలపై కీలక హామీలు
రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి సావిత్రి గారి నాయకత్వంలో నంద్యాలలోని ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన
“రజక ఆకాంక్ష సభ–5” కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది.
ఈ సందర్భంగా రజకుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. రజక సమాజానికి న్యాయం చేయాలన్న సంకల్పంతో ఈ అంశాన్ని అత్యున్నత స్థాయిలో లేవనెత్తుతామని తెలిపారు.
మౌలిక సదుపాయాల కల్పనపై హామీ
అలాగే నంద్యాల జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ధోబీ ఘాట్‌ల నిర్మాణం,
కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు కోసం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తానని ప్రకటించారు. రజకుల జీవనోపాధి మెరుగుపడాలంటే మౌలిక సదుపాయాలు అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు.
సమగ్ర అభివృద్ధే లక్ష్యం
రజక సమాజం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరింత బలోపేతం కావడమే మా ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి రజక కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


