Gomangi village road: పేదబయలు మండలం గోమాంగి గ్రామానికి రోడ్డు సదుపాయం డా. గుమ్మా తనుజా రాణి గారు హామీ
పేదబయలు మండలం గోమాంగి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించేందుకు అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డా. గుమ్మా తనుజా రాణి గారు హామీ ఇచ్చారు.
దశాబ్దాలుగా రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోమాంగి గ్రామ ప్రజలు, తమ సమస్యలను వివరించేందుకు శుక్రవారం ఎంపీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
రోడ్డు లేకపోవడం వల్ల వైద్య సేవలు, విద్య, రవాణా అవసరాలకు తీవ్ర అవరోధాలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విన్నవించారు.
ఈ సమస్యపై వెంటనే స్పందించిన ఎంపీ డా. గుమ్మా తనుజా రాణి గారు, గోమాంగి గ్రామానికి త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ గారి భర్త వినయ్ గారు (మన్యం జగన్), జెడ్పీటీసీ బొంజు బాబు గారు, సర్పంచ్ సురేష్ గారు, బాలరాజు, విజయ్, లక్ష్మణ్, సీతారామ్ గారుతో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గ్రామానికి రోడ్డు సమస్య త్వరలో పరిష్కారమవుతుందన్న హామీతో గోమాంగి గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


