back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeAndhra Pradesh Politics108 వాహనాలపై సాక్షి దుష్ప్రచారం: కర్నూలులో టీడీపీ ఘాటు నిరసన

108 వాహనాలపై సాక్షి దుష్ప్రచారం: కర్నూలులో టీడీపీ ఘాటు నిరసన

108 Ambulance controversy:108 వాహనాలపై సాక్షి దుష్ప్రచారం

వైఎస్సార్సీపి పార్టీ అనుబంధ సాక్షి దినపత్రిక 108 అంబులెన్స్ వాహనాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, కర్నూలు సి క్యాంపులోని 108 వాహనాల కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు పాల్గొని మాట్లాడారు.
గత వైఎస్సార్సీపి ప్రభుత్వ హయాంలో కాలం చెల్లి స్క్రాప్‌కు చేరిన 108 అంబులెన్స్ వాహనాలను చూపిస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం సాక్షి దినపత్రిక చేస్తోందని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.

108 సేవలను ప్రజల ప్రాణాలతో ముడిపడిన అత్యవసర సేవలుగా భావించాల్సిన సమయంలో, రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారహితమైన చర్య అని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి విమర్శించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం 108 సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో కూటమి నాయకులు, 108 సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లే కార్డులతో సాక్షి దుష్ప్రచారానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles