MGNREGA Yatra: సత్యసాయి జిల్లాలో వైఎస్ షర్మిల MGNREGA పరిరక్షణ యాత్ర – 3వ రోజు
సత్యసాయి జిల్లా: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పరిరక్షణ యాత్ర 3వ రోజు సత్యసాయి జిల్లాలో కొనసాగింది. ధర్మవరం నియోజకవర్గం, రాఘవంపల్లి గ్రామంలో వైఎస్ షర్మిల గారు కరువు పనులపై ఆధారపడి జీవిస్తున్న శ్రామికులను కలిసి, VB-G / RAM-G చట్టాల ద్వారా జరుగుతున్న నష్టాలను వివరించారు.
ఈ సందర్భంగా శ్రామికులు మాట్లాడుతూ,
ప్రస్తుత పాలకులు మన్‌రేగా పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, 100 రోజుల పని హామీ ఉన్నా సగం రోజులు కూడా పని కల్పించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అర్హత ఉన్న పేదల జాబ్ కార్డులను తొలగించడం వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని వాపోయారు.
వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ,
మన్‌రేగా పథకం గ్రామీణ పేదలకు జీవనాధారం అని, దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. మన్‌రేగా పరిరక్షణ ఉద్యమానికి ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు మరింత బలాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.
శ్రామికులకు భరోసా ఇస్తూ,
తాను కూడా గునపం పట్టి మట్టి తవ్వి పనిలో పాల్గొనడం ద్వారా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. మన్‌రేగా పథకం కొనసాగింపు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని తెలిపారు.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


