Kuppam E-Cycle Rally: 5,555 ఈ-సైకిళ్ల పంపిణీతో గిన్నిస్ రికార్డు స్థాయికి చేరిన సైకిల్ ర్యాలీ
కుప్పం: రాష్ట్రానికి ఆదర్శంగా పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నియోజకవర్గంలో నెట్ జీరో లక్ష్యంతో 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేయడం ఎంతో గర్వకారణమని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-సైకిల్ ర్యాలీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాయికి చేరుకోవడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంటూ, నెట్ జీరో లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి గారు చూపిన చొరవ ప్రశంసనీయమని తెలిపారు. శివపురంలోని తన స్వగృహం నుండి తుమిసి ప్రజా వేదిక వరకు ముఖ్యమంత్రి గారు స్వయంగా సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేయడం ఆయన నాయకత్వానికి స్పష్టమైన నిదర్శనమని అన్నారు.
ఎన్నో కష్టాలు, సమగ్ర ప్రణాళికల ఫలితంగా ఈ ఘనత చిత్తూరు జిల్లా, ముఖ్యంగా కుప్పం ప్రాంతానికి దక్కడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు దిశగా రాష్ట్రం ముందడుగు వేయడంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
ఇలాంటి గిన్నిస్ వరల్డ్ రికార్డులు రాష్ట్రానికి రావాలంటే దూరదృష్టి కలిగిన నాయకత్వం అవసరమని, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


