Ration Depot: పేరాపురం పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ డిపో
ప్రజలకు నిత్యావసర సరుకులు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ లక్ష్యంతో పేరాపురం పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ డిపోను నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు రేషన్ సరుకుల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజల ముంగిటకే నిత్యావసరాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. కొత్త రేషన్ డిపో ప్రారంభంతో పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు మరింత సౌకర్యం కలగనుందని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరిస్తామని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


