Anakapalli Utsav: ముత్యాలమ్మ పాలెం తీరంలో ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి అనిత వంగలపూడి
అనకాపల్లి: ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి అనిత వంగలపూడి గారు పరిశీలించారు. ముత్యాలమ్మ పాలెం తీరంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్, ఎస్పీ శ్రీ తుహీన్ సిన్హా, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేశ్ గారితో కలిసి ఉత్సవ ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఉత్సవానికి సంబంధించిన వేదికలు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అలాగే ముత్యాలమ్మ పాలెం తీరంతో పాటు కొండకర్ల ఆవ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాలపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, అనకాపల్లి ప్రతిష్టను మరింత పెంచేలా ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
అనకాపల్లి ఉత్సవ్‌ను ప్రజలకు గుర్తుండిపోయేలా సాంస్కృతిక వైభవంతో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


