AP Home Department Budget: రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
అమరావతి: రాష్ట్ర సచివాలయంలో హోంశాఖ బడ్జెట్ అంచనాలపై పోలీస్, ఇంటెలిజెన్స్, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసెస్, పోలీస్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్, ఈగల్, ఆక్టోపస్ తదితర విభాగాల ఉన్నతాధికారులతో హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత వంగలపూడి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పోలీస్ శాఖ ఆధునీకరణకు పెద్దపీట వేస్తూ, సిబ్బందికి మెరుగైన వసతులు, వనరుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. నేర నియంత్రణలో అత్యాధునిక సాంకేతికత వినియోగంతో ప్రజల భద్రత విషయంలో రాజీ లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
హోంశాఖ బడ్జెట్ అంచనాలపై ఉన్నతాధికారులతో సమీక్ష
ఈ సమావేశంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ శ్రీ రామకృష్ణ, ఫైర్ సర్వీసెస్ డీజీ శ్రీ వెంకటరమణ, ఎస్పీఎఫ్ ఐజీ శ్రీ వెంకట రమణారెడ్డి, స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఐజీ శ్రీ అబురాజన్, ఈగల్ ఐజీ శ్రీ రవికృష్ణ, పీటీఐ డీఐజీ శ్రీ సత్య ఏసుబాబు, బెటాలియన్ ఐజీ శ్రీమతి రాజకుమారి, ఆక్టోపస్ & ఈగల్ ఐజీ శ్రీ సెంథిల్ కుమార్తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అదేవిధంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారుతో కలిసి పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన నిధుల కేటాయింపులపై సుదీర్ఘ చర్చ జరిపారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సెక్రటరీలు శ్రీ వినయ్ కుమార్, శ్రీ రోనాల్డ్ రాస్, జాయింట్ సెక్రటరీ శ్రీ గౌతమ్ అల్లాడ, హోంశాఖ సెక్రటరీ శ్రీ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ శ్రీ మధుసూదన్, ఐజీ శ్రీ రవిప్రకాష్తో పాటు పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


