Anitha Vangalapudi: విజయవాడ క్యాంప్ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ సోదరి జయశాంతి గారిని మరియు వారి కుటుంబ సభ్యులను కలవడం ఎంతో సంతోషకరంగా ఉంది. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మన పోలీస్ సోదరీమణులకు నాకు ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుంది.
సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డులో చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించి, అంబులెన్స్‌కు దారి ఇవ్వడంలో ప్రత్యేక కృషి చేసిన జయశాంతి గారిని ఫోన్‌లో అభినందించాను. ఆమె నన్ను కలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడంతో ఈ రోజు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో కలసి ఆమెను సత్కరించాను.
మన రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అభివృద్ధి వ్యక్తం చేస్తున్నాను.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


