Andhra Pradesh development: పాయకరావుపేటలో ప్రజలతో కలిసి భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్న మంత్రి వంగలపూడి అనిత
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు తెలిపారు.
భోగి పండుగ వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని, అన్నదాత జీవితంతో విడదీయరాని అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి హరిదాసు కీర్తనలు, బసవన్నల ఆటల నడుమ భోగి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతిగా నిలిచిందని పేర్కొన్నారు.
సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి అనిత గారు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


