Viksit Bharat G Ram G Scheme: వికసిత్ భారత్ జీ-రామ్-జీ పథకం అమలు
పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో ఆస్తుల సృష్టి లక్ష్యంగా ‘వికసిత్ భారత్ జీ-రామ్-జీ’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్, జనసేన పార్టీ తరపున మంత్రి శ్రీ కందుల దుర్గేష్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్‌లో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్ (గ్రామీణ్) – వీబీ జీ రామ్ జీ’ పథకంపై ప్రజలకు, లబ్ధిదారులకు సమగ్ర అవగాహన కల్పించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
రాష్ట్రాన్ని 10 సూత్రాల ఆధారంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ లక్ష్యాల అమలుకు జీ-రామ్-జీ పథకం కీలకంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక ఆస్తుల సృష్టి, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలతో పాటు స్థిరమైన ఉపాధి కల్పనకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


