Irrigation projects: వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు 2026లో పూర్తి
రాష్ట్రంలో కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యతల వారీగా చేపట్టి నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ఏడాది హంద్రీ–నీవా కాల్వ వెడల్పు పనులను గడువు మేరకు పూర్తి చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
అదే తరహాలో 2026 సంవత్సరంలో వెలిగొండ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై నేడు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన రంగ అభివృద్ధి కార్యక్రమాలు, పూర్వోదయ పథకం అమలు, నల్లమల సాగర్ సహా పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు, వివిధ శాఖల్లో చేపట్టాల్సిన పీపీపీ (PPP) ప్రాజెక్టులు, జల్ జీవన్ మిషన్ పథకం, సాస్కీ నిధుల వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ కే. అచ్చెన్నాయుడు, శ్రీ నిమ్మల రామానాయుడు పాల్గొనగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కే. విజయానంద్‌తో పాటు ఆర్థిక, ఇరిగేషన్, వ్యవసాయం, ఆర్ అండ్ బి, మున్సిపల్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


