back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeAndra Pradesh Newsఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం | సూళ్లూరుపేట ఎమ్మెల్యే జయశ్రీ

ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం | సూళ్లూరుపేట ఎమ్మెల్యే జయశ్రీ

Flamingo Festival: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శాసన సభ్యురాలు శ్రీమతి నెలవల జయశ్రీ గారు కలిశారు. గురువారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా హాజరయ్యారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ సందర్భంగా ఈ నెల 10, 11 తేదీల్లో సూళ్లూరుపేటలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘ఫ్లెమింగో ఫెస్టివల్’కు హాజరుకావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే నెలవల జయశ్రీ గారు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ఆహ్వాన పత్రికను కూడా ఆమె అందజేశారు.

సూళ్లూరుపేట ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి, పక్షి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఫ్లెమింగో ఫెస్టివల్ ఎంతో కీలకమని ఈ సందర్భంగా నాయకులు వివరించారు. ఉప ముఖ్యమంత్రి హాజరు ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత తీసుకొస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles