Kadapa Deeni Ijtema: దీనీ ఇస్తిమా సభల ఏర్పాట్లపై కలెక్టర్‌తో కీలక చర్చ
కడప నగర శివారులోని కోపర్తి ప్రాంతంలో ఈ నెల జనవరి 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక దీనీ ఇస్తిమా సభల ఏర్పాట్లపై ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో కీలకంగా చర్చించడం జరిగింది.
ఈ సమావేశంలో Srinivasa Reddy Reddeppagari, ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారులు అహ్మద్ షరీఫ్ గారు, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి గారు, APIIC చైర్మన్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొన్నారు.
లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహాసభకు సంబంధించి తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, రహదారి సదుపాయాలు వంటి అన్ని ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మైనారిటీ సోదరుల మనోభావాలకు అనుగుణంగా కార్యక్రమం విజయవంతం అయ్యేలా కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కడప నగర అధ్యక్షులు మన్సూర్ అలీఖాన్, కడప పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ నాజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


