National Highways Development: కృష్ణా జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధిపై చర్చ
ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధిపై మచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారి కార్యాలయంలో NHAI & MoRTH (Ministry of Road Transport & Highways) ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు కోల్లు రవీంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల పనులు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై కూలంకషంగా చర్చించారు. ముఖ్యంగా పోర్టులు, పరిశ్రమలతో జిల్లాను అనుసంధానించేలా రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి ప్రతిపాదనలను NHAI అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు వల్లభనేని బాలశౌరి గారు, కేశినేని శివనాథ్ గారు, ఎమ్మెల్యేలు మండలి బుద్దప్రసాద్ గారు, గద్దె రామ్మోహన్‌రావు గారు, బోడే ప్రసాద్ గారు, వెనిగండ్ల రాము గారు, వర్ల కుమార్ రాజా గారు, కాగిత కృష్ణ ప్రసాద్ గారు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారుల అభివృద్ధి ద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సమావేశంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


