6th Mahila Fest Vijayawada:సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన 6వ మహిళా ఫెస్ట్ కార్యక్రమం
విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన 6వ మహిళా ఫెస్ట్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మహిళల ప్రతిభ, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని వెలుగులోకి తీసుకొచ్చేలా అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన తరుణీతరంగాలు బృందానికి డా. సైలజ రాయపాటి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డా. సైలజ రాయపాటి మాట్లాడుతూ, “మహిళ బలహీనత కాదు… సృష్టికి మూలం, సమాజానికి దిశ చూపే శక్తి” అని అన్నారు. కళలు, క్రీడలు, విద్య, వైద్యం నుంచి ఐఏఎస్–ఐపీఎస్ వంటి అత్యున్నత సేవల వరకు ప్రతి రంగంలో మహిళలు తమ సత్తాను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మెడల్స్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. ఇది మహిళలకు అందుతున్న అవకాశాలు, సరైన మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహానికి నిదర్శనమని చెప్పారు.
అదేవిధంగా ప్రభుత్వ కఠిన చర్యలు, పోలీస్ శాఖ అప్రమత్తత, మహిళా కమిషన్ సమర్థవంతమైన పర్యవేక్షణ కారణంగా రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గుతున్నాయని డా. సైలజ రాయపాటి స్పష్టం చేశారు. మహిళల భద్రత, సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా మరింత బలమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


