Alluri Sitarama Raju Village: మోగల్లు గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
రూ.1.93 కోట్లతో వాటర్ పైప్‌లైన్, మైక్రో ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభం
విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి స్వగ్రామమైన పాలకోడేరు మండలంలోని మోగల్లు మేజర్ పంచాయతీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా చేపట్టిన కీలక అభివృద్ధి పనులను ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించడం జరిగింది.
రూ.1.93 కోట్ల వ్యయంతో, మెయిన్ కెనాల్ నుండి ఊరి చెరువు వరకు 5 కిలోమీటర్ల మేర రక్షిత తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వాటర్ పైప్‌లైన్‌తో పాటు, 1.0 MLD సామర్థ్యం గల మైక్రో ఫిల్టర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.
ఎన్నో సంవత్సరాలుగా తాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న మోగల్లు గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. గ్రామ మహిళల కళ్లలో కనిపించిన ఆనందమే ఈ కార్యక్రమానికి నిజమైన సార్థకత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీఐఐసీ ఛైర్మన్ శ్రీ మంతెన రామరాజు గారు, పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


