Vizag Utsav: VMRDA సెంట్రల్ పార్క్‌లో జ్యోతి ప్రజ్వలన చేసిన పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం: గాజువాక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు వైజాగ్ ఉత్సవ్‌లో భాగంగా శుక్రవారం ఉదయం VMRDA సెంట్రల్ పార్క్లో నిర్వహించిన ఫ్లవర్ ఎగ్జిబిషన్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
విశాఖ నగర సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పుష్ప ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ రకాల పుష్పాలతో సృజనాత్మకంగా ఏర్పాటు చేసిన ఆకృతులు నగరవాసులతో పాటు పర్యాటకుల నుంచి మంచి స్పందనను పొందుతున్నాయి.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, వైజాగ్ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు నగర సాంస్కృతిక గుర్తింపును మరింత బలోపేతం చేయడమే కాకుండా ప్రజల్లో కళా–సంస్కృతులపై ఆసక్తిని పెంపొందిస్తాయని అన్నారు. ప్రజలతో మమేకమై అభివృద్ధి–సంస్కృతి రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వానికి ఈ కార్యక్రమం మరో ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.
వైజాగ్ ఉత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శిస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


