Kakinada Green Ammonia Project: కాకినాడకు చారిత్రక రోజు – రూ.13,000 కోట్ల ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన
కాకినాడకు నేడు ఒక చారిత్రక ఘట్టం. రూ.13,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి నేడు శంకుస్థాపన చేయనున్నారు.
495 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2,600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.2,000 కోట్ల విలువైన 2-గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
యూనిపర్ (Uniper) ఒప్పందంతో పాటు పలు అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ఎగుమతి కేంద్రంగా మారనుంది.
ఈ ప్రాజెక్టు ప్రారంభంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరగనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


