Shankaraguptham Major Drain:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు కూడా వర్చువల్‌గా హాజరయ్యారు. శంకరగుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో ఈ డ్రెయిన్ ఆధునికీకరణ పనులను చేపట్టారు. ఇటీవల రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి కేవలం 35 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపడం విశేషంగా నిలిచింది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే వరదల సమస్య తగ్గడంతో పాటు వ్యవసాయ భూములు రక్షించబడి, కొబ్బరి రైతులకు శాశ్వత ఊరట లభించనుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి ఇది మరో నిదర్శనంగా నిలుస్తోంది.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


