Darsi APCPDCL office: దర్శి పట్టణంలో రూ.4.19 కోట్లతో APCPDCL ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన
దర్శి పట్టణం అద్దంకి రోడ్డులో రూ.4.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న APCPDCL ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్) నూతన కార్యాలయ భవనానికి నిర్వహించిన భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సహచర మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. నూతన కార్యాలయ భవనం ద్వారా విద్యుత్ సేవల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


