Tiruvuru Drinking Water Project: 15 రోజుల్లో నీటి సరఫరా ప్రారంభం
తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలోని కోడూరు, పెద్ద తండాలలో ఆర్.డబ్ల్యు.ఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ట్యాంకులను ఈరోజు పరిశీలించడం జరిగింది. నిర్మాణం పూర్తయిన ఈ ట్యాంకులను మరో 15 రోజుల్లో ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు.
ప్రాంతంలో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ నుంచి శుద్ధ జలాలను కుడప వరకు తరలించి, అక్కడి నుంచి విస్సన్నపేట, గంపలగూడెం, ఏ కొండూరు మండలాల్లోని మొత్తం 38 గ్రామాలకు 55 వాటర్ ట్యాంకుల ద్వారా శుద్ధ తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 12,148 నివాస గృహాలకు ఇంటింటికి శుద్ధ జలాలు అందనున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గార్లతో కలిసి త్వరలో శుద్ధ జలాల సరఫరాను అధికారికంగా ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ట్రయల్ రన్ సన్నాహాల్లో భాగంగా ట్యాంకులను పరిశీలించిన అనంతరం, ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులు, తిరువూరు నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఎన్డీయే కూటమి వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


