Lok Nayak Foundation Awards: లోక్ నాయక్ ఫౌండేషన్ సామాజిక సేవ
విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక హోటల్ దసపల్లాలో డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 22వ వార్షిక పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కే. రఘు రామకృష్ణ రాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు, భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు కూడా వేదికను అలంకరించారు. సమాజానికి విశేష సేవలు అందించిన ప్రముఖులను ఈ కార్యక్రమంలో సత్కరించారు.
లోక్ నాయక్ ఫౌండేషన్ సామాజిక సేవ, ప్రజాసేవ రంగాల్లో చేస్తున్న కృషి ప్రశంసనీయమని వక్తలు పేర్కొన్నారు. ఇటువంటి పురస్కార కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


