Ontimitta Ramalayam: రాష్ట్ర ప్రజల శాంతి, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు – కందుల దుర్గేష్
కడప పర్యటనలో భాగంగా జనసేన పార్టీ నాయకులు, జనసైనికులతో కలిసి ర్యాలీగా ఒంటిమిట్టకు చేరుకున్న మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, అక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, సర్వతోముఖాభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర క్షేత్రంలో స్వామివారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత ప్రగతిపథంలో ముందుకు సాగాలని ప్రార్థించారు.
శ్రీరాముని కృపతో రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొని, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలుకావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


