Gampalagudem development works: తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం గ్రామంలో రూ.41 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన
తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం గ్రామంలో ఎస్సీ, బీసీ కాలనీల అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్రేగా) కింద రూ.41 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న “పల్లె పండుగ 2.0” కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గార్ల నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర సమగ్రాభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నామని, ఈ రోడ్ల నిర్మాణంతో గ్రామంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షులు మానికొండ రామకృష్ణ గారు, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు గారు, ఏఎంసీ చైర్పర్సన్ రేగళ్ళ లక్ష్మీ అనిత గారు, సర్పంచ్ కోటా పుల్లమ్మ గారు, స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు కాజా రవికుమార్ గారు, వీరా రెడ్డి గారు, సత్యం బాబు గారు, కావూరి బాబు గారు, గువ్వల వెంకటేశ్వర్ రెడ్డి గారు, యసారపు ముత్యాల రావు గారు, కోట వెంకటేశ్వరరావు గారు, వేముల బాలయ్య గారు, రాఘవమ్మ గారు, ఎంపీడీవో సరస్వతి గారు, ఎన్డీయే కూటమి నాయకులు, పంచాయతీరాజ్ డిఈ, ఏఈ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


