Kuppam Multi Skill Development Center: యువతకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలే లక్ష్యం
కుప్పం: కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నవదిశ కేంద్రంలో ఏర్పాటు చేసిన హిందాల్కో – ఆదిత్య బిర్లా గ్రూప్ – కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథార్టీ భాగస్వామ్యంతో రూపొందించిన మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు ప్రయోజనకరమైన నైపుణ్య శిక్షణ అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. పరిశ్రమల అవసరాలు – యువత సామర్థ్యాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే దిశగా ఈ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఈ కేంద్రం ద్వారా సుమారు 2500 కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ది పొందనున్నాయి. అంతేకాకుండా, రానున్న రోజుల్లో దాదాపు 20 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి, సాధికారత, ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రభుత్వం – పరిశ్రమల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కుప్పం ప్రాంతాన్ని నైపుణ్యాభివృద్ధి హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలకంగా నిలవనుంది.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


