Indian Dairy Association Award: ఇండియన్ డైరీ అసోసియేషన్ నుంచి అత్యుత్తమ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు అందుకున్న సందర్భంగా హెరిటేజ్ కుటుంబం వ్యక్తం చేసిన ప్రేమ, ఆప్యాయత మరియు సానుభూతికి నారా భువనేశ్వరి గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జూమ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో హెరిటేజ్ గ్రూప్ డైరెక్టర్లు, సీఈఓ, సీఓఓ, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, కార్పొరేట్ బృందం సభ్యులు మరియు ప్లాంట్ స్థాయి ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ అవార్డు వ్యక్తిగతంగా తనకే కాదు, హెరిటేజ్ గ్రూప్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కష్టానికి, నిబద్ధతకు లభించిన గౌరవమని నారా భువనేశ్వరి గారు పేర్కొన్నారు.
హెరిటేజ్ గ్రూప్‌ను ఒక కుటుంబంలా భావిస్తూ, సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఈ గుర్తింపుకు భాగస్వాములేనని ఆమె స్పష్టం చేశారు. డెయిరీ రంగంలో నాణ్యత, విశ్వసనీయత, రైతు సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతున్న హెరిటేజ్ ప్రయాణంలో ఈ అవార్డు మరింత ప్రేరణనిస్తుందని తెలిపారు.
భవిష్యత్తులో కూడా డెయిరీ రంగ అభివృద్ధికి, రైతుల ఆదాయం పెంపుకు, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు హెరిటేజ్ గ్రూప్ నిరంతరం కృషి చేస్తుందని నారా భువనేశ్వరి గారు విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


