Sai Jyothi writer: వైకల్యాన్ని జయించి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న రచయిత్రి సాయిజ్యోతి
మంగళగిరి 26వ వార్డుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు చింతక్రింది సాయిజ్యోతి రచించిన ‘చేయి వీడని చెలిమి’ అనే నవలను విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సాయిజ్యోతి మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
అంధురాలైన సాయిజ్యోతి, మొబైల్‌లోని వాయిస్ ఇన్‌పుట్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రచనలు చేయడం విశేషం. ‘చైత్రశ్రీ’ అనే కలం పేరుతో ఇప్పటికే ‘కవితాంజలి’ అనే కవితా సంపుటితో పాటు ‘మంచుతాకిన ప్రేమ’, ‘ఎవరు అతను’ అనే నవలలు, అలాగే సామాజిక స్పృహ కలిగించే పలు కథలను ఆమె రచించారు.
ప్రస్తుతం నూతక్కి హైస్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిజ్యోతి, వైకల్యాన్ని జయించి తన ప్రతిభతో యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. సాహిత్య రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు శ్రీమతి తమ్మిశెట్టి జానకీదేవి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


