Cognizant Davos AP: ఏపీలో 25,000 ఉద్యోగాల అభివృద్ధి కేంద్రానికి కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్‌లోని కాగ్నిజెంట్ లాంజ్‌ను సందర్శించి, సంస్థ సీఈఓ శ్రీ రవి కుమార్తో పాటు సీనియర్ నాయకత్వ బృందాన్ని కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, గత సంవత్సరం ఇదే వేదికపై కాగ్నిజెంట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై తొలి చర్చలు ప్రారంభమయ్యాయని, నేడు ఆ సంభాషణలు కార్యరూపం దాల్చి రాష్ట్రంలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌పై విశ్వాసం ఉంచి 25,000 ఉద్యోగాలు సృష్టించబోయే సరికొత్త అభివృద్ధి కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నందుకు కాగ్నిజెంట్ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది రాష్ట్ర యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, ఏపీని గ్లోబల్ ఐటీ హబ్‌గా నిలబెట్టే దిశగా కీలక అడుగుగా అభివర్ణించారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


