Rajahmundry Airport :ప్రాంతీయ కనెక్టివిటీకి భారీ ఊతం
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న కొత్త ఎయిర్‌పోర్టు టెర్మినల్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్న ఈ టెర్మినల్ ప్రాంతీయ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది.
ఈ కొత్త టెర్మినల్ ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు పెద్దపీట వేస్తూ, వ్యాపార అవకాశాలను విస్తరించేందుకు ఈ ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా గోదావరి ప్రాంత పర్యాటకానికి ఇది మరింత ఊపునివ్వనుందని అధికారులు పేర్కొంటున్నారు.
త్వరలోనే మరిన్ని విమాన సర్వీసులను ప్రారంభించి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రాజమహేంద్రవరం నగరం ప్రాంతీయ, జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యత పొందనుంది.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


