Gajuwaka MLA: ప్రజల సమస్యలపై ప్రత్యక్ష స్పందన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు నేడు గాజువాక నియోజకవర్గంలో విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సాధకబాధలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్థానికులు తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించగా, పల్లా శ్రీనివాసరావు గారు అత్యంత ఓపికతో వారి మాటలను ఆలకించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
గాజువాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తామని తెలిపారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు గారు నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


