Pedda Amiram Grand Flying – కాళ్ళ మండలం పెద అమిరంలో పారామోటరింగ్ గ్రాండ్ ఫ్లయింగ్ ప్రారంభం
పెద అమిరం (కాళ్ళ మండలం):
సంక్రాంతి పండుగ వేడుకలను మరింత ఉత్సాహంగా, ఆకర్షణీయంగా నిర్వహించాలనే లక్ష్యంతో కాళ్ళ మండలం పెద అమిరం గ్రామంలో ఈరోజు ఉదయం “స్పెక్టాక్యులర్ పారామీటర్ ఏరియల్ ఎక్స్పీరియన్స్ – గ్రాండ్ ఫ్లయింగ్” కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి సి. నాగరాణి గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ రాహుల్ కుమార్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. పర్యాటక మరియు సాంస్కృతిక ఉత్సవాల్లో అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ గ్రాండ్ ఫ్లయింగ్ కార్యక్రమంలో భాగంగా మొత్తం 6 పారామోటరింగ్ వాహనాలను అందుబాటులో ఉంచారు. పారామోటరింగ్ వాహనం ద్వారా సుమారు 600 అడుగుల ఎత్తులో 5 నిమిషాల పాటు గగనవీధిలో ప్రయాణించే అవకాశం ప్రజలకు కల్పించారు. ఈ అనుభూతి పర్యాటకులను, యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని అధికారులు తెలిపారు.
సంక్రాంతి వేడుకలను సంప్రదాయం, సంస్కృతి తో పాటు ఆధునిక అడ్వెంచర్ అనుభవాలతో మేళవించి నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించడంతో పాటు స్థానిక ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


