Konaseema Sankranthi celebrations: కోనసీమలో సంక్రాంతి సంబరాలు ఘనంగా – డ్రాగన్ బోట్ ఫైనల్స్, కైట్ ఫెస్టివల్‌కు విశేష స్పందన
డా. బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం కెనాల్ వద్ద ఘనంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని విశ్వవ్యాప్తంగా చాటుతున్నాయి. గ్రామీణ సంప్రదాయాలు, నదీ క్రీడలు, జానపద కళల సమ్మేళనంగా ఈ ఉత్సవాలు కోనసీమ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ సంబరాల్లో భాగంగా మూడో రోజు నిర్వహించిన డ్రాగన్ బోట్ ఫైనల్స్ కార్యక్రమాన్ని సహచర మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందరావు గార్లతో కలిసి ప్రారంభించారు. పెన్నా నది తీరాన్ని తలపించేలా సాగిన ఈ పోటీలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
అదేవిధంగా పర్యాటక శాఖ, షాప్ (SHAP) ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ కార్యక్రమం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. రంగురంగుల గాలిపటాలతో ఆత్రేయపురం కెనాల్ పరిసరాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి. చిన్నారులు, యువత, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలను మరింత ఉత్సాహంగా మలిచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కోనసీమ ప్రాంతాన్ని ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఇలాంటి సాంస్కృతిక ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా స్థానిక కళాకారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


