Srikalahasti MGM Institutions: విద్యను అందుబాటులోకి తెచ్చిన MGM సంస్థల సేవలు అభినందనీయం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలోని MGM విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో బీజేపీ సీనియర్ నాయకురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
గతంలో విద్య సుదూరంగా ఉన్న ఈ ప్రాంతంలో విద్యా సంస్థను స్థాపించి అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన మల్లిఖార్జున నాయుడు గారి సేవలు అభినందనీయం అన్నారు.
అలాగే MGM విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ గుడ్లూరు మయూర్, గుడ్లూరు ఐశ్వర్య లక్ష్మి గార్లు విద్య, సేవ, ఆరోగ్య రంగాల్లో చేస్తున్న కృషి మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడమే ఈ సంస్థల లక్ష్యమని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో
మాజీ ఎమ్మెల్యే, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ పెందుర్తి వెంకటేష్, వివిధ రంగాల ప్రముఖులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా కొనసాగాయి.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


