Kovvur Janasena Incharge: T.V. రామారావు పునర్నియామకం
తూర్పు గోదావరి జిల్లా | కొవ్వూరు: కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జిగా శ్రీ టి.వి. రామారావు గారిని పునర్నియమిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు.
నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, కూటమి స్పూర్తికి విఘాతం కలగకుండా ప్రజల మధ్య పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యతను శ్రీ టి.వి. రామారావు గారు సమర్థవంతంగా నిర్వర్తిస్తారని పార్టీ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.
అలాగే, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడం, నియోజకవర్గంలో జనసేనను మరింత బలమైన రాజకీయ శక్తిగా నిలపడం ఆయన ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.
ఈ పునర్నియామకంతో కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీ టి.వి. రామారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


