Amaravati Avakaya Festival: 45 వేల మందికి పైగా సందర్శకులు
విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికలుగా మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించిన “అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్” విజయవంతంగా ముగిసింది. ఈ వేడుకలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం ఎంతో సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్‌ను ఒక ప్రత్యేక సాంస్కృతిక బ్రాండ్‌గా తీర్చిదిద్దుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా 2026 డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్‌ను మళ్లీ ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించి నంది అవార్డుల ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. నాటకం, సినిమా, సాహిత్యం ఒకే వేదికపై మెరిసిన ఈ ఫెస్టివల్‌లో జరిగిన చర్చలు, కళాప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మూడు రోజుల వేడుకల్లో భాగంగా భవానీ ఐలాండ్‌కు 15,000 మంది, పున్నమి ఘాట్‌కు 30,000 మంది మొత్తం 45,000 మందికి పైగా సందర్శకులు పాల్గొనడం ఈ కార్యక్రమ విజయానికి నిదర్శనంగా నిలిచింది.
అమరావతిని ప్రజారాజధానిగా, ఆవకాయను ఆంధ్రుల సాంస్కృతిక అంతర్భాగంగా నిలబెట్టే దిశగా ఈ ఫెస్టివల్ కీలక ముందడుగు వేసిందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన పర్యాటక శాఖ అధికారులు, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులు, కళాకారులు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


