Vadde Obanna: తెల్లదొరల అణచివేతకు ఎదురొడ్డిన పోరాటం చిరస్మరణీయం
స్వాతంత్య్ర సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డె ఓబన్న తెల్లదొరల అణచివేతకు ఎదురొడ్డి సాగించిన పోరాటం భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఓబన్న జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన సీఎం, వడ్డె ఓబన్న దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని అన్నారు. బ్రిటిష్ పాలకుల దమనకాండకు లొంగకుండా ప్రజల హక్కుల కోసం పోరాడిన ఓబన్న, రేనాటి ప్రాంతంలో స్వేచ్ఛా జ్యోతి వెలిగించిన వీరుడిగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు.
సామాన్య కుటుంబంలో జన్మించి, అన్యాయానికి ఎదురొడ్డి పోరాడిన వడ్డె ఓబన్న జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని తెలిపారు.
వడ్డె ఓబన్న చూపిన దేశభక్తి మార్గాన్ని అనుసరిస్తూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


