Tilaru Railway Station: తిలారు రైల్వే స్టేషన్‌లో బ్రహ్మపూర్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌కు హాల్టు ప్రారంభం
నేడు తిలారు రైల్వే స్టేషన్‌లో బ్రహ్మపూర్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు (18525/26)కు హాల్టును కేటాయించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు కింజరాపు గారు, మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు, ఎమ్మెల్యే శ్రీ బగ్గు రమణమూర్తి గారు, రైల్వే అధికారులతో కలిసి జెండా ఊపి రైలును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఒకేసారి శ్రీకాకుళం జిల్లాకు మూడు రైలు హాల్టులను కేటాయించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ ప్రాంత రైల్వే స్టేషన్లలో అనేక నూతన రైలు సర్వీసులు, కొత్త హాల్టులను మంజూరు చేయడం ద్వారా ప్రయాణికుల కనెక్టివిటీ మరింత మెరుగుపడిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా శ్రీకాకుళం జిల్లాలో రైల్వే అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, రైల్వే స్టేషన్ల సుందరీకరణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


