Payakaraopeta Road Expansion: ₹5.25 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
పాయకరావుపేట: పాయకరావుపేటలో VMRDA చైర్మన్ శ్రీ ప్రణవ్ గోపాల్ గారితో కలిసి ఎమ్మెల్యే అనితా వంగలపూడి గారు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు గజమాలలతో, సోదరీమణులు హారతులతో ఘనంగా స్వాగతం పలకడం మరువలేని అనుభూతిగా ఉందని ఆమె తెలిపారు. తమపై చూపిన ప్రేమాభిమానాలకు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు ₹5.25 కోట్ల నిధులతో గౌతమ్ థియేటర్ కూడలి వద్ద శంకుస్థాపన చేశారు. గౌతమ్ థియేటర్ జంక్షన్ నుంచి వై జంక్షన్ వరకు ఆక్రమణలను తొలగించి, ప్రజలకు విశాలమైన, సుందరమైన రహదారిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని అనితా వంగలపూడి గారు తెలిపారు.
ఈ రహదారి విస్తరణ పూర్తయితే పాయకరావుపేటలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి, వాణిజ్య, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగస్వాములైన VMRDA చైర్మన్ శ్రీ ప్రణవ్ గోపాల్ గారికి, VMRDA కమిషనర్ శ్రీ తేజ్ భరత్ గారికి మరియు సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


