Gandikota Festival 2026: గండికోట ఉత్సవాలు–2026కు శోభాయాత్రతో ఘన ఆరంభం
Gandikota Festival 2026 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శోభాయాత్ర గండికోట సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని అద్భుతంగా ప్రతిబింబించింది. పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే సంప్రదాయ వేషధారణలు, జానపద నృత్యాలు, కళారూపాలు ఈ శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ శోభాయాత్రలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి & బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవిత గారు, జిల్లా కలెక్టర్ & టూరిజం కౌన్సిల్ చైర్మన్ డా. శ్రీధర్ చెరుకూరి గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ సి. ఆదినారాయణ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు, యువ నాయకులు శ్రీ భూపేష్ రెడ్డి గారు తదితర ప్రముఖులతో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉందని జనసేన నాయకులు కందుల దుర్గేష్ తెలిపారు.
ఈరోజు నుంచి 13వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్న గండికోట ఉత్సవాలకు నాందిగా నిర్వహించిన ఈ శోభాయాత్ర ప్రజల్లో అపూర్వమైన ఉత్సాహాన్ని నింపింది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన ప్రజలు, పర్యాటకులు గండికోట చారిత్రక వైభవాన్ని ఆస్వాదిస్తూ శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
గండికోట ఉత్సవాల ద్వారా ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పునర్వైభవం తీసుకువచ్చి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని నేతలు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయని తెలిపారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


