Gunda Appala Suryanarayana: గుండ అప్పల సూర్యనారాయణ గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన నాయకుడు – పార్టీకి తీరని లోటు
టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ గుండ అప్పల సూర్యనారాయణ గారి అంత్యక్రియలు ఈరోజు అరసవల్లిలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయునికి అశ్రునివాళులు అర్పించాను.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ గుండ అప్పల సూర్యనారాయణ గారు జీవితాంతం ఒకే సిద్ధాంతానికి కట్టుబడి, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన గొప్ప నాయకుడని కొనియాడారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకితభావం యువ నాయకులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
అప్పల సూర్యనారాయణ గారితో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని, నిబద్ధత కలిగిన ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం పార్టీకి మాత్రమే కాకుండా జిల్లా ప్రజలకు కూడా తీరని లోటుగా అభివర్ణించారు.
ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ శోకాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


