Ambedkar Konaseema ONGC: ONGC బ్లోఔట్ మంటలు అదుపులోకి
అంబేద్కర్ కోనసీమ జిల్లా | మలికిపురం మండలం: మలికిపురం మండలంలోని ఇరుసు ప్రాంతంలో ONGC వేల్‌లో సంభవించిన బ్లోఔట్ మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. తీవ్ర ఆందోళన కలిగించిన ఈ ఘటనను నియంత్రించేందుకు ONGC అధికారులు పలు రోజులుగా నిరంతరంగా చర్యలు చేపట్టగా, చివరికి వేల్‌కు BOP (Blow Out Prevention) వ్యవస్థను విజయవంతంగా ఫిక్స్ చేయడంతో మంటలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి.
బ్లోఔట్ కారణంగా పరిసర ప్రాంతాల్లో భయం నెలకొనగా, సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రమాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి రావడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ కీలక దశ పూర్తికావడంతో ONGC అధికారులు విజయాన్ని గుర్తుగా సంబరాలు జరుపుకున్నారు. భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకున్న అనంతరం పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుతోందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని ONGC తెలిపింది.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


