statue of the late Sri Krishna: విజయవాడ లెనిన్ సెంటర్‌లో స్వర్గీయ సినీ నటుడు కృష్ణ విగ్రహ ఆవిష్కరణ
విజయవాడ లెనిన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సినీ నటులు, తెలుగు చిత్ర పరిశ్రమకు ధృవతారగా నిలిచిన స్వర్గీయ శ్రీ కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆదిశేషగిరిరావు గారు, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ గారు, విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ గారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
తెలుగు సినీ వినీలాకాశంలో తనదైన ముద్ర వేసిన కృష్ణ గారు, సాంస్కృతిక, పౌరాణిక, సామాజిక చిత్రాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా పెంచిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.
స్వర్గీయ కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ తెలుగు ప్రజలకు గర్వకారణమని, భావితరాలకు ఆయన సేవలను గుర్తు చేసే చిరస్మరణీయ కార్యక్రమమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


