VPR Amrutadhara: గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యం
గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించి వారి దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం, ఎగువపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “విపిఆర్ అమృతధార” వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి గారితో కలిసి పాల్గొని, గ్రామ ప్రజలకు తాగునీటి సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరింత ఊపు
అనంతరం గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించి, గ్రామ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు వేశారు. రహదారుల అభివృద్ధితో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని, సమగ్ర గ్రామాభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విపిఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


